స్మార్ట్‌ఫోన్ల పనితీరును మరో స్థాయికి తీసుకెళ్తూ ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ ‘మీడియాటెక్’, తన సరికొత్త చిప్‌సెట్లు ‘డైమెన్సిటీ 9500s’ మరియు ‘డైమెన్సిటీ 8500’లను ఆవిష్కరించింది. ఢిల్లీలో నిర్వహించిన ‘మీడియాటెక్ టెక్ డే’ వేదికగా ఈ అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేశారు. ఇవి ప్రధానంగా ఖరీదైన (ఫ్లాగ్‌షిప్) మరియు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కోసం రూపొందించబడ్డాయి.