తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన డాక్టర్లకు సేవా అవార్డుల ప్రధానం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా - డాక్టర్ అశ్విణి అమరేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో మహిళా డాక్టర్లు అత్యంత నైపుణ్యంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ అశ్విణి అమరేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యరంగంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన డాక్టర్లను ప్రత్యేకంగా సన్మానించి సేవా అవార్డులను ప్రధానం చేశారు. ఈ సంవత్సరం ప్రపంచ మహిళా దినోత్సవం థీం షీ లీడ్స్ - 2026 ఆధారంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ డాక్టర్ చిన్న బాబు సుంకవల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్  డాక్టర్ టి. చిరంజీవి, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె.ఎస్. లక్ష్మి, డాక్టర్ దీప్తిల ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లతో చర్చా వేదికలు నిర్వహించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన డాక్టర్లు అమితా రాణి, డాక్టర్ శ్రీ కీర్తి, డాక్టర్ శ్రావ్య, డాక్టర్ స్వాతి రెడ్డి, డాక్టర్ నివేదిత సాయిచంద్ర, డాక్టర్ హవ్య పోలవరపు, డాక్టర్ శివాణి, డాక్టర్ సోనాలి చతుర్వేది, డాక్టర్ అమూల్య మైసూర్, డాక్టర్ వెన్నెల, డాక్టర్ పూనం సింగల్, డాక్టర్ సంగీత, డాక్టర్ సృజన, డాక్టర్ అఖిల తదితరులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన డాక్టర్లకు సేవా అవార్డుల ప్రధానం

What's your reaction?

0
AWESOME!
AWESOME!
0
LOVED
LOVED
0
NICE
NICE
0
LOL
LOL
0
FUNNY
FUNNY
0
EW!
EW!
0
OMG!
OMG!
0
FAIL!
FAIL!

Comments

Leave a Reply

Recent News