దేవనకొండ : మండల పరిధిలోని తెర్నేకల్ గ్రామ సచివాలయం టు నందు బాల్యవివాహాలను అరికట్టాలని అంగన్వాడి టీచర్లు కే. పరిమళ, సజీవమ్మ, రుతమ్మ మరియు సచివాలయ సిబ్బంది, వైద్యాధికారులు,మరియు గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల గురించి అంగన్వాడి టీచర్ కే పరిమిల, సంజీవమ్మ మాట్లాడుతూ.... బాల్య వివాహం 18 ఏళ్ల లోపు బాలికలు,21 ఏళ్లలోపు బాలురకు జరిగే పెళ్లిళ్లు చట్ట విరుద్ధం అని ఇది బాలల హక్కుల ఉల్లంఘన పేదరికం, సామాజిక నిబంధనలు, అభద్రత భావం దీనికి ప్రధాన కారణాలు అన్నారు. ఇవి అమ్మాయిల చదువు, ఆరోగ్యాన్ని దెబ్బతీసి,2006( పి సి ఎం ఎ ) కఠినమైన చర్యలు తీసుకుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Leave a Reply